సెంట్రల్‌ సోషల్‌వెల్ఫేర్‌ బోర్డులో ఎంపీ బుట్టాకు సభ్యత్వం | MP butta renuka as a member of cswboard | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ సోషల్‌వెల్ఫేర్‌ బోర్డులో ఎంపీ బుట్టాకు సభ్యత్వం

Published Sat, Aug 13 2016 12:18 AM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

సెంట్రల్‌ సోషల్‌వెల్ఫేర్‌ బోర్డులో ఎంపీ బుట్టాకు సభ్యత్వం - Sakshi

సెంట్రల్‌ సోషల్‌వెల్ఫేర్‌ బోర్డులో ఎంపీ బుట్టాకు సభ్యత్వం

కర్నూలు (ఓల్డ్‌సిటీ): కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డులో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ బోర్డు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఒక భాగం. గత జూన్‌ నెల 20వ తేదీ నుంచే సభ్యత్వం ప్రారంభమైంది. బుట్టా రేణుక ఈ బోర్డులో మూడేళ్ల పాటు సభ్యురాలుగా కొనసాగుతారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు అధ్యక్షులందరు సభ్యులుగా ఉంటారు. లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో బుట్టా రేణుకతో పాటు ప్రియాంక రావత్‌కు సభ్యత్వం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement