భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
Published Thu, Nov 17 2016 11:08 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
– నేటి నుంచి రిజర్వేషన్లు ప్రారంభం
– ఎంపీ బుట్టా రేణుక వెల్లడి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈనెల 26, 27, 28 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో నిర్వహించే ఇస్తెమాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి ముస్లింలు అధికంగా వెళ్తారని వారి కోసం ప్రత్యేకంగా రైలు ఏర్పాటు చేయాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఆమె విన్నపం మేరకు కేంద్ర రైల్వే బోర్డు నుంచి మంజూరు లభించింది. అందుకు సంబంధించిన ప్రతిని ఎంపీ గురువారం పత్రికలకు విడుదల చేశారు. ప్రత్యేక రైలు (నంబర్ 7423) ఈనెల 24వ తేదీ రాత్రి 10.55 గంటలకు డోన్‌లో బయలుదేరి 12 గంటలకు కర్నూలు చేరుకుంటుంది. 12.10 గంటలకు కర్నూలు నుంచి వెళుతుంది. 25వ తేదీ రాత్రి 11.20 గంటలకు భోపాల్ చేరుకుంటుంది. అలాగే భోపాల్ ఇస్తెమా ముగిసిన తర్వాత ప్రత్యేక రైలు (నంబర్ 7424) 28వ తేదీ రాత్రి 9.00 గంటలకు భోపాల్‌లో బయలుదేరి 29వ తేదీ రాత్రి 9.15కు కర్నూలు, 11.30కు డోన్ చేరుకుంటుందని ఎంపీ తెలిపారు. నేటి నుంచి రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని, ఇస్తెమాకు వెళ్లే ముస్లింలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. కాగా గత మూడేళ్లుగా ఆమె భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయిస్తుండటంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement