భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
Published Wed, Oct 12 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో నవంబరు 24 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న ఇస్తెమాకు ప్రత్యేక రైలు (రానుపోను) ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తను కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. బుధవారం సికింద్రాబాద్‌లో రవీంద్ర గుప్తకు ఎంపీ పలు సమస్యలు విన్నవించారు. వివిధ రైల్వే ప్రాజెక్టులు ఆర్‌యూబీ, ఆర్‌వోబీ (మద్దికెర, తుగ్గలి)తో పాటు కొత్తగా వెలసిన స్టేషన్లలో రైళ్ల ఆపుదల ఏర్పాట్లు (కుప్పగాళ్ ఆర్‌ఎస్) గురించి చర్చించారు. కర్నూలు, ఆదోని, మంత్రాలయం రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా బెంచీల ఏర్పాటునకు రూ. 15.50 లక్షల ఎంపీ నిధులు విడుదల కూడా చేశారు. ఆయా పనులను త్వరగా ముగించి ప్రారంభించాలని, మంత్రాలయం నుంచి మట్టిమర్రి రైల్వే లైన్ (బ్రిడ్జీ) పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు.
Advertisement