జిమ్కు వెళ్లనివ్వడం లేదని రైలుకు ఎదురెళ్లి.. | Stopped from going to gym, teen ends life | Sakshi
Sakshi News home page

జిమ్కు వెళ్లనివ్వడం లేదని రైలుకు ఎదురెళ్లి..

Published Sun, Jul 3 2016 12:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

జిమ్కు వెళ్లనివ్వడం లేదని రైలుకు ఎదురెళ్లి..

జిమ్కు వెళ్లనివ్వడం లేదని రైలుకు ఎదురెళ్లి..

భోపాల్: క్షణికావేశంలో ఓ కుర్రాడు తన నిండు ప్రాణాలు బలితీసుకున్నాడు. రైలుకు ఎదురుగా వెళ్లి దానికిందపడి చనిపోయాడు. తనను జిమ్ కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన ప్రాంతంలో ఆత్మహత్య లేఖ లభ్యం కావడం ద్వారా వివరాలు వెంటనే లభించాయి. భోపాల్లోని ఎయిర్పోర్ట్ రోడ్డులో సింగర్చోలికి చెందిన ప్రిన్స్ యాదవ్ అనే యువకుడు జిమ్ కు వెళ్లడం ప్రారంభించాడు.

అయితే, జిమ్ కు వెళ్లొద్దని తన తండ్రి వారించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. రెండు రోజులయినా కుమారుడు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపులు చేపట్టిన పోలీసులకు అతడు శవమై కనిపించాడు. అతడి వద్ద ఆత్మహత్యగల కారణాలు వివరిస్తూ రాసిన లేఖను గుర్తించారు. కాగా, తండ్రికి ఒక షాపు ఉందని, వారిది ఉమ్మడి కుటుంబం అని, అతడి ఆత్మహత్య అనుమానాలు కూడా కలిగిస్తున్నాయని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement