ఐక్యతతోనే బీసీల హక్కుల సాధన
ఐక్యతతోనే బీసీల హక్కుల సాధన
Published Sun, Nov 6 2016 10:51 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
– కార్తీక వనభోజనాల్లో ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(అర్బన్): బీసీలు ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంగన్నబావి సమీపంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ఆమె హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. బీసీల్లోని అన్ని కులాలకు చెందిన వారిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే మంచి ఉద్దేశంతో కార్తీక వనభోజనాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ.. బీసీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారి హక్కులను సాధించుకునేందుకు సమష్టిగా పోరాడాలన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతు దేశంలో బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, రాష్ట్ర కార్యదర్శి ఎం. రాంబాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుయాదవ్, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కె. రామకృష్ణ, నాయకులు బుర్రా ఈశ్వరయ్య, కేతూరి మధు, డా.పుల్లన్న, లక్ష్మినారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంముని పాల్గొన్నారు.
Advertisement