ఫలించిన ఎంపీ కృషి
మూడు రోడ్లకు జాతీయ స్థాయి
– కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రికి బుట్టా రేణుక కృతజ్ఞతలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక రెండేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. తన నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర రహదారులను జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని ఎంపీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ జయరాం గడ్కరీకి విన్నవిస్తూ వస్తున్నారు. ఈ మేరకు కర్నూలు నియోజకవర్గం గుండా వెళ్లే మూడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి గడ్కారీకి ఎంపీ బుట్టా రేణుక కృతజ్ఙతలు తెలియజేశారు.
జాతీయస్థాయికి అప్‌గ్రేడ్ అయిన రోడ్లు ఇవే..
1) ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని గుత్తితో అనుసంధానమై ఉన్న పత్తికొండ, ఆదోని, మదిరే, హనవల్, కుంతనహాయ్, ఉప్పరహాల్, కౌతాళం, ఉరుకుంద, హాల్వి, కుంబాలనూరు, మాన్వి ప్రాంతాలు కలిపే రోడ్డు (ఏపీలో 135 కి.మీ., కర్ణాటకలో 15 కి.మీ.ల మేరకు)
2) కొత్తకోట, గూడూరు, మంత్రాలయంను కలిపే రోడ్డు 167వ జాతీయ రహదారిగా మార్పు కానుంది.(ఏపీ 22 కి.మీ., తెలంగాణాలో 70 కి.మీ.)
3) ఏపీలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద క్రాస్ అయ్యే 167వ జాతీయ రహదారి నుంచి కర్ణాటకలోని బళ్లారితో అనుసంధానం. (ఏపీలో 2 కి.మీ., కర్ణాటకలో 26 కి.మీ.)