ప్రమాదంలో ధ్వంసమైన షెడ్డు(ఫైల్)
సాక్షి, కర్నూలు : గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నెగ్గి, ఆపై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనలో ధ్వంసమైన ఇళ్ల పరిశీలనకు వచ్చిన బుట్టా రేణుకను గ్రామస్తులు అడ్డుకున్నారు. తక్షణమే క్వారీని సీజ్ చేసి తమకు ఇళ్లు కట్టించాలని వారు డిమాండ్ చేశారు.
మృతదేహాల తరలింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం
క్వారీ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలను స్వరాష్ట్రానికి పంపించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది జార్ఖండ్‌కు చెందిన వారు ఉన్నారు. అయితే వీరిని అంబులెన్స్‌లో తరలించడానికి కుదరదంటున్నారు అంబులెన్స్ సిబ్బంది. మృతదేహాలను హైదరాబాద్ వరకు మాత్రమే తీసుకెళ్తామంటున్నారు. మార్చురీ ఫ్రీజర్లలో ఉంచిన పది మృతదేహాల్లో కేవలం నాలుగింటిని మాత్రమే అధికారులు గుర్తించారు. మిగిలిన వారి వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment