ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆహ్వానం | mp butta renuka invites two central ministers to kurnool | Sakshi
Sakshi News home page

ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

Published Fri, Mar 24 2017 4:07 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆహ్వానం - Sakshi

ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆహ్వానం

కర్నూలు (ఓల్డ్‌సిటీ): అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కర్నూలు జిల్లాకు రావాలంటూ ఇద్దరు కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ఈమేరకు ప్రకటన వెలువడింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీని.. ఆదోనిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మైనారిటీల కోసం మంజూరైన వివిధ పనులను ప్రారంభించాలని కోరినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో పార్లమెంట్‌ సమావేశాల తర్వాత పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి నక్వి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని..ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించాలని కోరామని,  చేనేత కార్మికుల ఇబ్బందులను వివరించగా ఆమె  సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement