దేవాలయాల అభివృద్ధికి కృషి
దేవాలయాల అభివృద్ధికి కృషి
Published Mon, Nov 7 2016 9:18 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
ఆస్పరి: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాననిఽ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆస్పరి సమీపంలోని రామతీర్థంలో వెలసిన పంచముఖి గాయత్రీ మాత దేవాలయం ఆవరణలో సోమవారం వినాయక విగ్రహం, ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రవికాంత్ శర్మ ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్ట, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి శంకరబండ, ఆస్పరి, చిరుమాన్‌దొడ్డి, హలిగేరి తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కళాకారుల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బుట్టారేణుకను వేదపండితులు, గ్రామ పెద్దలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాయత్రీ మాత దేవాలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడు, ధ్వజ స్తంభాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు సమీపంలోని శ్రీగిరి క్షేత్రంలో సిమెంట్‌రోడ్లు, ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని ఎంపీనీ కోరారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. సిమెంట్ రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అనంతరం బిణిగేరి గ్రామ పెద్దలు ఎంపీ బుట్టారేణుక, ధ్వజ స్తంభం దాత రెడ్డి శేఖర్ రావు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దొరబాబు, ఎంపీటీసీలు సావిత్రమ్మ, రంగస్వామి, ఆపార్టీ నాయకులు మురళీరెడ్డి, దత్తాత్రేయరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తోయజోక్షప్ప, నాగేంద్రరెడ్డి, న రసింహులు, నల్లన్న, లింగన్న, లింగన్న, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement