అంతటా నో క్యాష్‌ బోర్డులే: ఎంపీ రేణుక | no cash boards in telugu states, says mp Butta Renuka | Sakshi
Sakshi News home page

అంతటా నో క్యాష్‌ బోర్డులే: ఎంపీ రేణుక

Published Fri, Mar 24 2017 3:57 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

అంతటా నో క్యాష్‌ బోర్డులే: ఎంపీ రేణుక - Sakshi

అంతటా నో క్యాష్‌ బోర్డులే: ఎంపీ రేణుక

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణల్లో ఎక్కడ చూసినా నగదు నిల్వలు లేవంటూ ఏటీఎంల ముందు బోర్డులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. పెద్ద నోట్లరద్దు ప్రక్రియను తాము స్వాగతి స్తున్నామని, అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. బ్యాంకులకు వెళ్లినా నగదు ఉపసంహరణ సేవలు అందడం లేదన్నారు. ప్రజల కష్టాలను ఇకనైనా తొలగిం చాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement