మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దుతా
–ఎంపీ బుట్టా రేణుక
ఆదోని: ఆదోని రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. ఎంపీ ల్యాడ్స్‌తో బెంచీలు కొనుగోలు చేసి స్టేషన్‌లోని విశ్రాంతి గదిలో ఏర్పాటు చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డితో కలిసి వాటిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆçదోని, కర్నూలు, మంత్రాలయం రెల్వే స్టేషన్లలో బెంచీల కోసం రూ.7.73లక్షలు మంజూరు చేశానన్నారు. ఇందులో సగం కుషన్ చైర్లు కాగా మిగిలినవి మెటల్ బెంచీలన్నారు. క్రాంతినగర్ వాసుల వినతి మేరకు రైల్వే స్టేషన్ మీదుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తానని, ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
స్టేషన్‌లో తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ ల్యాడ్స్ కింద నిధులు మంజూరు చేస్తామని, ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు పంపాలని డీఆర్‌ఎం అమితాబ్ ఓఝాకు సూచించారు. అంచనా మేరకు కలెక్షన్్స రాలేదని ఆదోని మీదుగా తిరిగే రెండు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను అధికారులు రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని తక్షణమే పునరుద్ధరించి కనీసం ఏడాది పాటు కొనసాగించాలని, అప్పటికీ కలెక్షన్్స రాకపోతే రద్దు విషయమై ఆలోచిద్దామని డీఆర్‌ఎంకు సూచించారు. రాష్ట్ర రాజధాని విజయవాడకు ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం సీహెచ్ రమేష్, స్టేషన్ మాస్టరు వెంకటేశ్వర్లు, కమర్షియల్ విభాగం సూపర్‌వైజర్ లక్ష్మయ్య, నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, రాముడు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.