
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనే నాయకులు, కార్యకర్తల కోసం విజయవాడ నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు శుక్రవారం (2వ తేదీ) సాయంత్రం 7 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలన్నారు. రైలు రాత్రి 10 గంటలకు బయలు దేరుతుందని తెలిపారు. 5వ తేదీ ధర్నా కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు ఢిల్లీ నుండి రైలు తిరిగి బయలుదేరి 7వ తేదీ ఉదయం విజయవాడకు చేరుకుంటుందన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఢిల్లీలో వసతి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment