
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నాంథేడ్ – తిరుపతి– నాంథేడ్‌ల మధ్య (07633/07634) ఈనెలలో నాలుగు ట్రిప్పులను నడపనున్నట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. నాంథేడ్ నుంచి తిరుపతికి వచ్చే రైలు ఈనెల 16, 23 తేదీల్లో బయలుదేరుతుందన్నారు. నాంథేడ్‌లో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు కడపకు, 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. తిరుపతి నుంచి నాంథేడ్‌కు వెళ్లే రైలు ఈనెల 17,24 తేదీల్లో బయలుదేరుతుందన్నారు.
పలు రైళ్లకు స్టాపింగ్‌లు
జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలిపేందుకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుమల, హరిప్రియ, రాయలసీమ రైళ్లను ఆపనున్నారు. ఈనెల 14 నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రాజంపేట, నందలూరులో ఆపనున్నారు. ఈనెల 15 నుంచి హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ను ఓబులవారిపల్లి, నందలూరులో, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15నుంచి రైల్వేకోడూరు,ఓబులవారిపల్లి, రాజంపేట స్టేషన్లలో ఆపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరు నెలలు మాత్రమే ఈ అవకాశాన్ని రైల్వే అధికారులు కల్పించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment