![Special train between Narsapur and Secunderabad - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/23/train.jpg.webp?itok=_byHVWz_)
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నర్సాపూర్– సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ తెలిపారు. ఈ మేరకు నర్సాపూర్– సికింద్రాబాద్(07255/07256) ప్రత్యేక రైలు ఈ నెల 26న సాయంత్రం 6.15కి నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రా బాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 27న రాత్రి 9కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ మణుగూరు వరకు..
రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కొల్హాపూర్– హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను వచ్చే ఏడాది మార్చి 14 నుంచి మణుగూర్ వరకు పొడిగించనున్నట్లు సీపీఆర్వో వెల్లడించారు. ఈ మేరకు కొల్హాపూర్– మణుగూర్ (11304/ 11303) ఎక్స్‌ప్రెస్‌గా సేవలం దించనుంది.
కొల్హాపూర్‌లోని ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మి నల్ నుంచి ఉదయం 7.35కి బయలుదేరి మరుసటి రోజు మధ్యా హ్నం 1.30కి మణుగూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యా హ్నం 3.30కి మణుగూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.40కి కొల్హాపూర్ చేరుకోనుంది. మార్చి 14 నుంచి ఈ రైలు నాంపల్లి స్టేషన్‌కు బదులు వయా సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment