సికింద్రాబాద్-హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు
Published Tue, Aug 22 2017 11:18 AM | Last Updated on Tue, Sep 12 2017 12:46 AM
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా గౌహతి మార్గంలోని రెగ్యులర్ రైళ్లు రద్దు కావడంతో సికింద్రాబాద్-హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం. ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. సికింద్రాబాద్-హౌరా స్పెషల్ (రైల్ నెంబర్: 02513) సికింద్రాబాద్ నుంచి ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు హౌరా చేరుతుంది. తిరుగు ప్రయాణంలో.. హౌరా-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 02514) హౌరా నుంచి ఈ నెల 25వ తేదీ తెల్లవారుజాము 1.05 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
Advertisement
Advertisement