అనకాపల్లి–గుంటూరు మధ్య ప్రత్యేక రైలు  | Special train between Anacapalli to Guntur | Sakshi
Sakshi News home page

అనకాపల్లి–గుంటూరు మధ్య ప్రత్యేక రైలు 

Published Wed, Mar 6 2024 5:14 AM | Last Updated on Wed, Mar 6 2024 5:14 AM

Special train between Anacapalli to Guntur - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): హోసన్నా మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో గుంటూరు జి­ల్లా, గోరంట్లలో ఈనెల 7 నుంచి 10 వరకు జరిగే క్రైస్తవ మహాసభలు (గుడారా­ల పండుగ)కు తరలివచ్చే భక్తుల సౌకర్యం కోసం అనకాపల్లి–గుంటూరు మధ్య ప్ర­త్యే­క రైలును నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు.

అనకాపల్లి–గుంటూరు ప్రత్యేక రైలు (07225) ఈనెల 6న రాత్రి 7.40 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి, మరుసటి­రోజు తెల్లవారుజామున 4 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈరైలు (07226) ఈనెల 10న రాత్రి 10.30 గంటలకు గుంటూరులో బ­యలుదేరి, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైలు తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్‌లలో ఆగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement