సాక్షి. హైదరాబాద్: రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత రాష్ట్రంలోని భక్తులను అయోధ్య రామ మందిరానికి రైళ్లలో తీసుకువెళ్తామని హామీనిచి్చ న భారతీయ జనతాపార్టీ ఆ మేరకు ప్రత్యేక ఆస్తా రైళ్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 200మందిని తీసుకువెళ్లనుంది. ఆ ప్రత్యేక ఆస్తా రైలులో మొత్తం 20 బోగీలు ఉంటాయనీ, ఒక్కో ట్రైన్‌లో 14 వందల మందికి ప్రయాణించే అవకాశం ఉంటుందనీ, అయోధ్యకు వెళ్లి వచ్చేందుకు 5 రోజుల సమ యం పట్టనుందని వెల్లడించింది.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికులు వెళ్లే రైలు జనవరి 29 వ తేదీన బయలుదేరుతుందనీ, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ప్రయాణికుల రైలు జనవరి 30న, హైదరాబాద్ ప్రయాణికుల రైలు జనవరి 31, కరీంనగర్– ఫిబ్రవరి 1న, మల్కాజ్‌గిరి– ఫిబ్రవరి 2న, ఖమ్మం– ఫిబ్రవరి 3న, చేవెళ్ల– ఫిబ్రవరి 5, పెద్దపల్లి– ఫిబ్రవరి 6, నిజామాబాద్– ఫిబ్రవరి 7, అదిలాబాద్– ఫిబ్ర వరి 8, మహబూబ్‌నగర్– ఫిబ్రవరి 9. మహబూబ్‌బాద్– ఫిబ్రవరి 10, మెదక్– ఫిబ్రవరి 11, భువనగిరి– ఫిబ్రవరి 12, నాగర్ కర్నూల్ – ఫిబ్రవరి 13, నల్లగొండ – ఫిబ్రవరి 14, జహీరాబాద్ ప్రయాణికుల రైలు– ఫిబ్రవరి 15న బయ లుదేరుతాయి.
సికింద్రాబాద్, నిజమాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, మెదక్ పార్లమెంట్ నియోజక వర్గాల ప్రయాణీకుల రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరతాయనీ, నల్లగొండ, వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ప్రయాణికుల రైళ్లు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతాయని బీజేపీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment