జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు | Special Train For Jyotirlinga Divya Dakshin Yatra | Sakshi
Sakshi News home page

జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు

Published Thu, May 30 2024 7:58 AM | Last Updated on Thu, May 30 2024 9:07 AM

Special Train For Jyotirlinga Divya Dakshin Yatra

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ):  దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ “జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ ఎం.రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

జూన్‌ 22న సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ పర్యాటక రైలు అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచి్చ, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి జూన్‌ 30న తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి.

సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలుకు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో యాత్రికులు ఎక్కిదిగేందుకు అవకాశం కలి్పంచారు. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి స్లీపర్‌ క్లాస్‌ రూ.14,250, 3 ఏసీ రూ.21,900, 2 ఏసీ రూ.28,450గా ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్‌ లేదా విజయవాడలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయం గాని సెల్‌ : 9281495848, 8287932312 నంబర్ల ద్వారా టికెట్‌లు బుకింగ్‌ చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement