యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేక రైలు | Authorities Have Set up A Special Train For The UPSC Exams | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేక రైలు

Published Sat, Sep 5 2020 8:10 AM | Last Updated on Sat, Sep 5 2020 8:16 AM

Authorities Have Set up A  Special Train For The UPSC Exams - Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ) :  యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విశాఖలో ఆదివారం నిర్వహించనున్న నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నావల్‌ అకాడమీ పరీక్షలకు  అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటుచేశారు.  ఈ రైలును ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నడపనున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠీ తెలిపారు. ఇచ్ఛాపురం–విశాఖ–ఇచ్ఛాపురం మధ్య ఈ ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం–విశాఖ స్పెషల్‌ రైలు (05831), తిరుగు ప్రయాణంలో (05832) నంబరుతో నడవనుంది. రైలులో ప్రయాణించే అభ్యర్థులు విధిగా అడ్మిట్‌ కార్డ్‌ వెంట తెచ్చుకోవాలి. ఈ స్పెషల్‌ రైలుకు  స్టేషన్ల బుకింగ్‌ కౌంటర్ల వద్ద టికెట్లు ఇవ్వనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement