
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఇటీవల పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ‘సాక్షి’తో చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఫోన్‌లో అందుబాటులో ఉంటానని మంత్రి చెప్పారు. ఇదిలా ఉండగా మంత్రి కుమారుడు వెంకట శివసాయినందీష్‌కు కూడా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కూడా హోం ఐసోలేషన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. (పోలీసులకు సహకరించని నూతన్‌నాయుడు)