
గువహతి : ముంబై నుంచి శ్రామిక్ రైలులో స్వస్ధలాలకు చేరుకుంటున్న వలస కూలీలు రెండు వారాల క్వారంటైన్‌ను తప్పించుకునేందుకు రైలులో ఎమర్జెన్సీ చైన్ లాగిన ఘటన వెలుగుచూసింది. ఈ ఉదంతంలో 61 మందిని అరెస్ట్ చేయగా రైల్వేలు, అసోం పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ముంబై నుంచి దిబ్రూగఢ్ వెళుతున్న లోక్‌మాన్య తిలక్ శ్రామిక్ రైలు మంగళవారం అర్ధరాత్రి హజోయి రైల్వేస్టేషన్‌కు చేరుకునే సమయంలో వలస కూలీలు చైన్ లాగారు.
హజోయి వద్ద రైలు దిగిన 56 మందిని ఆర్పీఎఫ్ పోలీసులు అదేరోజు రాత్రి అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో అసోం పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ముంబై నుంచి వీరందరూ తిరిగి వస్తుండటంతో హజోయి స్టేషన్‌లో ఈ ఘటన కలకలం రేపింది. ఇక అసోం లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment