సాక్షి, అమరావతి: వర్దా తుపాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. డిసెంబర్14, 15వ తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దయిన రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
14వ తేదీన: 12616 ఢిల్లీ ఎస్ రోహిలా– చెన్నై సెంట్రల్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, 12622 న్యూఢిల్లీ– చెన్నై సెంట్రల్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, 57273 హుబ్లి– తిరుపతి ఇంటర్‌సిటీ ప్యాసింజర్
15వ తేదీన..: 16094 లక్నో– చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, 12296 పాటలీపుత్ర– బెంగళూరు సిటీ సంగమిత్ర ఎక్స్‌ప్రెస్, కాచీగూడ – చెంగల్‌పట్టు ప్రత్యేక రైలు
ప్రయాణీకుల రద్డీని దృష్టిలో పెట్టుకొని కాచీగూడ– చెంగల్‌పట్టు మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక రైలు (నెంబర్ 07652) 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు కాచిగూడలో బయలుదేరి రాత్రి 7.10కి చెంగల్‌పట్టు చేరుకుంటుంది.
పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
Published Wed, Dec 14 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
Advertisement