Verde cyclone
-
ఆ జాలర్ల జాడేది?
► కుటుంబాల్లో ఆందోళన ► కాశిమేడులో ఉత్కంఠ ► ఆచూకీ కోసం అన్వేషణ ► వర్దా తాండవంలో గల్లంతయ్యారా... పొట్ట కూటి కోసం సముద్రంలోకి వెళ్లిన పది మంది జాలర్ల ఆచూకీ లభించ లేదు. అసలు వీళ్లు ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. వర్దా తుపాన్ కు ముందే సముద్రంలోకి వెళ్లిన తమ వాళ్లు ఎక్కడో ఓ చోట సురక్షితంగా ఉంటారని భావించిన కుటుంబాల్లో రోజులు గడిచే కొద్ది ఆందోళన అధికమవుతోంది. తమ వాళ్లను వర్దా మింగేసిందా..? అన్న ఆవేదనతోకన్నీటి పర్యంతం అవుతున్నారు. మంగళవారం మత్స్య శాఖ మంత్రి డి జయకుమార్ దృష్టికి సమాచారం రావడంతో ఆచూకీ కోసం అన్వేషణ మొదలైంది. సాక్షి, చెన్నై: వర్దా తుపాన్ ఈనెల ఐదో తేదీన చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. 120 నుంచి 130 కీ.మీ వేగంతో వీచిన గాలుల దాటికి పెను నష్టం తప్పలేదు. రూ. 22 వేల కోట్ల మేరకు నష్టాన్ని చవి చూశామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రకటించడమే కాదు, ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నష్టం అపారమే అయినా, పెను ప్రాణ నష్టాన్ని ముందస్తు చర్యలతో అడుకున్నారని చెప్పవచ్చు. వర్దా ధాటికి 24 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పది మంది జాలర్ల ఆచూకీ కానరాకపోవడంతో ఆందోళన నెలకొంది. పది మంది ఎక్కడ: వర్దా తుపాన్ ప్రభావం తొ లుత ఆంధ్రా వైపుగా అత్యధికంగా ఉంటుందన్న సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి , మూడో తేదీ ఉదయం కాశిమేడు నుంచి జాలర్లు కడలిలోకి వెళ్లారు. మూడో తేదీ రాత్రికి వర్దా చెన్నై వైపుగా ముంచుకొస్తున్న సమాచారంతో సాగరంలోకి వెళ్లిన జాలర్ల తిరుగు పయనం కావాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఓ వైపు కోస్ట్ గార్డ్, నౌకాదళం ద్వారా, మరో వైపు రేడియోల ద్వారా సమాచారాలు సముద్రంలోని జాలర్లకు పంపించారు. జాలర్లందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టేనని భావించారు. వర్దా ధాటి నుంచి తమ పడవల్ని రక్షించుకునేందుకు జాలర్లు తీవ్రంగానే శ్రమించారు.ఈ సమయంలో పది మంది జాలర్ల ఆచూకీ కన్పించడం లేదన్న సమాచారంతో, వారు ఎక్కడున్నారో, ఏమయ్యారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. కన్నీటి పర్యంతం: కాశిమేడుకు చెందిన పది కుటుంబాలు, వారి ఆప్తులు, బంధువులు కన్నీటి పర్యంతంతో అక్కడి మత్స్యశాఖ కార్యాలయం వద్దకు పరుగులు తీశారు. ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి వేటకు వెళ్లిన తమ వాళ్లు, ఆంధ్రా వైపుగా లేదా, నాగపట్నం , పాండిచ్చేరిల వైపుగా వేటకు వెళ్లి ఉంటారని భావించామని పేర్కొన్నారు. తుపాన్ తీరం దాటి వారం రోజులు అవుతున్నా, తమ వాళ్ల నుంచి ఇంత వరకు ఎలాంటి ఫోన్ కూడా రాలేదని ఆ కుటుంబాలు కన్నీటి పర్యంతంతో విలపిస్తున్నాయి. వర్దా ధాటికి వీరు గల్లంతయ్యారా..? లేదా, ఎక్కడైనా చిక్కుకుని ఉన్నారా..? అన్న ఆందోళనలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాళ్ల ఆచూకీ కనిపెట్టాలని అధికారుల్ని వేడుకున్నారు. అక్కడి నుంచి నే రుగా మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ను కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఆ పది మంది ఆచూకీ కోసం అన్వేషన్ మొదలెట్టారు. సముద్రంలోకి వెళ్లి ఆచూకీ గల్లంతైన వారిలో మాధవన్, వెంకటరామన్, అంతోని రాజ్, రవి, రాజేం ద్రన్, శివ, నిర్మల్ రాజ్, వినోద్, మల్లికార్జునలతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్: శివార్లలో జన జీవనం మెరుగు పడుతోంది. క్రమంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ఆగమేఘాలపై సాగుతున్నాయి.. కొన్ని చోట్ల కాసేపు విద్యుత్ సరఫరా అందిస్తుండగా, మరి కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో విద్యుత్ అందుతున్నది. మరికొన్ని చోట్ల రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు తగ్గ చర్యలతో అధికారులు ముందుకు సాగుతున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు గాను సాంకేతిక పరంగా తాము పూర్తి సహకారం అందిస్తున్నామని, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ప్రజలకు అందుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మంగళవారం ప్రకటించారు. ఇక, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తంగమణి అధికారులతో కలిసి పనుల్ని పరిశీలిస్తూ వేగవంతం చేయించే పనిలో నిమగ్నం అయ్యారు. కాగా, ఈ వర్దా ధాటికి తాంబరం సమీపంలోని టీబీ ఆసుపత్రికి భారీ నష్టం జరిగింది. రూ.ఐదు కోట్ల మేరకు ఈ నష్టం ఉండడం గమనార్హం. వదంతులు నమ్మోద్దు: తుపాన్ వదంతుల్ని నమ్మవద్దు అని ప్రజలకు వాతావరణ శాఖ సూచించిం ది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో నె లకొన్న అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరా ల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి స్టెల్లా తెలిపారు. ఆ ద్రోణి బలపడే విషయంగా పూర్తి సమాచారం లేదని, తుపాన్ ముంచుకొస్తుందన్న ఆందోళన వద్దు అని సూచించారు. -
వండలూరు జూకు వర్దా దెబ్బ
►నేలకూలిన 10 వేల వృక్షాలు ► తాత్కాలికంగా మూసివేత టీనగర్: వర్దా తుపాన్ తాకిడికి వండలూరు జూలో పదివేల చెట్లు నేలకొరిగాయి. దీంతో వండలూరు జూను పునరుద్ధరించేందుకు మరో వారం రోజులకు పైగా సమయం పట్టవచ్చని జూ అధికారులు తెలిపారు. దీంతో ఈ జూను తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొన్నారు. వర్దా తుపాన్ వండలూరు జూలో మునుపెన్నడూ లేని విధంగా భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీంతో ప్రస్తుతం సందర్శకులకు అనుమతి లభించడం లేదు. అక్కడ విరిగిపోయిన చెట్ల కొమ్మలను, నేల కూలిన వృక్షాలను తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీని గురించి వండలూరు జూ డిప్యూటీ డైరెక్టర్ షణ్ముగం విలేకరులతో మాట్లాడుతూ వర్దా తుపాన్ ముందు జాగ్రత్త చర్యగా జంతువులు, పక్షులను వాట సంరక్షణ కేంద్రాల్లో భద్రపరిచామని, దీంతో ఏ జంతువు తప్పించుకుని పారిపోలేదన్నారు. కొన్ని జంతువుల బోన్లపై చెట్టుకొమ్మలు విరిగి పడ్డాయని ప్రస్తుతం వీటిని తొలగిం చే పనుల్లో ఉన్నామన్నారు. వండలూరు జూలో 10 వేలకు పైగా వృక్షాలు నేలకూలాయని, దీని సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నా రు. వృక్షాలు కూలడంతో ప్రహరీ గోడ దెబ్బతిందని, గోడ కూలడంతో ఒక మొసలి మాత్రం స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. తాత్కాలికంగా మూత: ప్రస్తుతం సందర్శకులను జూలోకి అనుమతించకుండా తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా ఏర్పాట్లు ఖరారు చేసిన తర్వాతనే సందర్శకులకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. -
పరామర్శ
► వర్దా బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన ► పరామర్శలు...పలకరింపులు ►షార్ట్‌ఫిల్‌్మలా సాగిన స్టాలిన్ పర్యటన ► వ్యవసాయరుణాలు రద్దు చేయాలని డిమాండ్ తిరువళ్లూరు : వర్దా తుపాను సృష్టించిన బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన రైతులకు తక్షణ సాయం అందించడంతో పాటు జాతీయ బ్యాంకుల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష నేత స్టాలిన్ అన్నారు. వర్దా తుపాను బీభత్సానికి భారీ నష్టం ఏర్పడడంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యం లో తిరువళ్లూరు జిల్లా తుపాను బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటించి బాధితులకు సహాయకాలను పంపిణీ చేయడంతో పాటు రైతులను పరామర్శించారు. మొదట కొండంజేరి ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే పదికిలోల బియ్యం, దుప్పటితో పాటు పలు సహాయకాలను పంపిణీ చేశారు. అనంతరం సత్రం వద్ద రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. అక్కడి నుంచి విడయూర్‌కు వెళ్లగా మధ్యలో కన్నిమానగర్ ప్రజలు తమ సమస్యలను స్టాలిన్ దృష్టికి తెచ్చారు. తాగునీరు, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. అనంతరం విడయూర్, తిరువళ్లూరు, వల్లువర్పురం ప్రాంతాల్లో స్టాలిన్పర్యటించి సహాయకాలను అందజేశారు. వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి : సహాయకాల పంపిణీ అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వర్దా తుపాను వల్ల కాంచీపురం, తిరువళ్లూరులో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, వారికి అండగా నిలిచేం దుకు రుణాలను రద్దు చేయడంతో పాటు తక్షణ సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వర్దా తుపానుకు తిరువళ్లూరు తీవ్రంగా నష్టపోయినా సహాయకాలు మాత్రం అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలో ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నుంచి తమిళనాడులో తరచూ విపత్తులు సంభవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సాయం చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం వర్దా తుపానుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని తాము డిమాండ్ చేసినా రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విపత్తు సంభవించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి సరిపుచ్చుకుంటుందని విమర్శించిన ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా కలిసి నష్టాన్ని వివరించి నిధులను రాబట్టాలని సూచించారు. వర్దా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుఉ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే ఐఏఎస్‌లతో ప్రత్యేక కమిటీని నియమించి కేంద్రం సాయం కోరాలని సూచించారు. వర్దా తుపానుతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకునీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షార్ట్ ఫిల్‌్మలా సాగిన స్టాలిన్ పర్యటన: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాలిన్ పర్యటన పరామర్శలు, పలకరింపులతో సాగింది. ప్రతి చోటా ఐదు నిమిషాలు మాత్రమే ఆగిన స్టాలిన్, ఆ ప్రాంతాల్లో ప్రజల కష్టాలను వింటూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలు వినడం, కార్యకర్తలకు పలకరింపు, డీఎంకే నేతలకు సూచన, మీడియా పోలీసుల హడావిడి కనిపించింది. మొత్తానికి స్టాలిన్ పర్యటన షార్ట్ ఫిల్‌్మలా సాగింది. -
కష్టాల వర్దా
► చీకట్లో చెన్నై శివార్లు ►నగరంలో ఆందోళనలు ► మంత్రి కారు ముట్టడి ►50 వేల హెక్టార్లలో పంట నష్టం ►త్వరలో రాష్ట్రానికి కేంద్ర బృందం రాక వర్దా తుపాను తమిళనాడును కకావికలంచేసింది. పచ్చని చెట్లను నేలకూల్చింది.విద్యుత్ స్తంభాల్ని విరిచేసింది. ఈకష్టాలు.. కన్నీళ్ల నుంచి జనం ఇంకాతేరుకోలేదు . చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో మూడు రోజులైనా సాధారణ పరిస్థితులు కానరావడం లేదు. సాక్షి ప్రతినిధి, చెన్నై: గత ఏడాది డిసెంబర్లో ఏర్పడిన వరద బీభత్సాన్ని ప్రజలు మరువక ముందే ఈ నెల 12వ తేదీన వర్దా తుపానుతో మరో విలయతాండవాన్ని చవిచూశారు. గంటకు 130–140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల దెబ్బకు మూడు జిల్లాలు కకావికలమయ్యాయి. వర్దా విలయతాండవం ముగిసి మూడు రోజులైనా విషాదకర దృశ్యాలు ఇంకా అలానే ఉన్నాయి. ఒక్క చెన్నై నగరం లోనే లక్షవృక్షాలు నేలకొరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రధాన రహదారుల్లో అడ్డంగా పడిన వృక్షాలను తొలగించినా ఇతర రోడ్లలో భారీ వృక్షాలు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి. నగరంలో 238 రహదారులు కూలిపోయిన వృక్షాలతో నిండిపోయాయి. సుమారు 20వేల మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నా పనులు వేగంగా సాగడం లేదు. రోడ్లకు ఇరువైపునా కూలి ఉన్న వృక్షాలతో చెన్నై నగరం అడవిని తలపిస్తోంది. మూడురోజుల్లో మొత్తం వృక్షాలను తొలగిస్తామని కార్పొరేషన్ హామీ ఇస్తాంది. ప్రస్తుతం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ సరఫరా పునునరుద్ధరణకు 8వేల మంది పనిచేస్తున్నా ఇంకా అనేక ప్రాంతాలు చిమ్మచీకట్లో ముగ్గుతున్నాయి. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ తండియార్పేట, పుదువన్నార్పేట, వవుసీనగర్ తదితర ఆరు ప్రాంతాల్లో గురువారం ప్రజలు రాస్తారోకో జరిపారు. తిరువొత్తియూరు, దాని పరిసర ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మంత్రి కరుప్పన్నన్ కారును బాధితులు అడ్డగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీకి దిగడంతో ప్రజలు తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో సహాయ కమిషనర్, ఇన్స్పెక్టర్లకు గాయాలయ్యాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని, రెండురోజుల్లో పూర్తవుతాయని విద్యుత్ శాఖా మంత్రి తంగమణి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు ఐఏఎస్ అధికారి సబితా నేతృత్వంలో గురువారం ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. విద్యుత్ కోసం శివారు ప్రాంతాల ప్రజలు జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. నిత్యావసరాలకు సైతం నీళ్లు లేకపోవడంతో జనరేటర్లకు గంటకు రూ.2వేలు అద్దె చెల్లిస్తున్నారు. వర్దా తుపాన్ శాంతించినా రాష్ట్రం లో అక్కడక్కడ వర్షాలు కరుస్తూనే ఉన్నా యి. ఊటి కొండ రోడ్డు మార్గంలో కొండచ రియలు విరిగి పడడంతో మూడున్నర గంటల పాటూ ట్రాఫిక్ స్తంభించింది 50వేల హెక్టార్లలో పంట నష్టం: కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో 50వేల హెక్టార్లలో పంటనష్టం సంభవించడంతో రైతన్నలు బావురుమంటున్నారు. అరటి, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. కాంచీపురంలో 55వేల ఎకరాల్లో వరిసాగు కోతలకు వచ్చింది. వర్దా తుపానుతో చేతికందిన పంటను కోల్పోవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. కాంచీపురం, చెంగల్పట్టు, ఉత్తిరమేరూరు ప్రాంతాల్లో 10వేల ఎకరాల చెరుకుతోట, 10వేల ఎకరాల అరటితోట దెబ్బతింది. తిరువళ్లూరు జిల్లాలో మాత్రమే 30వేల హెక్టార్ల పంటనష్టం సంభవించినట్లు అంచనా. త్వరలో కేంద్ర బృందం రాక: వర్దా తుపాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు త్వరలో కేంద్రబృందం రాష్ట్రానికి చేరుకోనుంది. వర్దా తుపాన్ వల్ల రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల నష్టం ఏర్పడినట్లు అంచనా. తుపాన్ సహాయార్థం వెంటనే రూ.1000 కోట్లు కేటాయించాల్సిందిగా సీఎం పన్నీర్‌సెల్వం రెండురోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రం రెండు రోజుల్లో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపి నష్టం అంచనాలు సిద్ధం చేసేందుకు అంగీకరించింది. -
తేరుకుంటున్న చెన్నై
► కూలిన చెట్ల మధ్య జన జీవనం ►సహాయ కార్యక్రమాలు ముమ్మరం ►రెండు నౌకల్లో ఆహారం ►మరో రెండు రోజులు వర్షాలు ►నేడు విద్యాసంస్థలకు సెలవు వర్దా తుపాను తీవ్రతతో తమిళనాడు ప్రజలు తల్లడిల్లిపోయారు.కూలిపోయిన భారీ వృక్షాల మధ్య చిక్కుకుపోయారు. బైటకు వచ్చే వీలులేక ఇళ్లలోనే బందీలుగా మారిపోయారు. తినేందుకు అన్నం, తాగేందుకు నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్దా తుపాను తమిళనాడులోని నాలుగు జిల్లాల ప్రజలను వణికించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 130–140 కిలో మీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు భయపడిపోయిన ప్రజలు సోమవారం రాత్రి వరకు ఎవ్వరూ ఇళ్ల నుంచి బైటకు రాలేదు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాత్రంతా ప్రజలు చిమ్మచీకట్లో గడిపారు. తెల్లారేసరికి సా«ధారణ పరిస్థితులు నెలకొని ఉంటాయని ఆశించిన ప్రజలు రోడ్లలోని పరిస్థితులను చూసి బిత్తరపోయారు. ఎటుచూసినా నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. వాటికింద పడి నలిగిపోయిన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దర్శనమిచ్చాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర జిల్లాల ప్రజలు వర్దా తుపానుతో విలవిల్లాడిపోయారు. తుపానులో చిక్కుకున్న పది వేల మందిని సహాయక బృందాలు రక్షించాయి. చెన్నై పరిసరాల్లో సిటీ బస్సులు, ఆటో, లోకల్ రైళ్ల రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తుపాను తీవ్రస్థాయికి చేరుకోవడంతో బస్సుల్లోని ప్రజలను మధ్యలోనే దించి వేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రజలు రాత్రంతా చీకట్లోనే గడిపి, తెల్లారిన తరువాత కిలోమీటర్ల దూరం నడిచి గమ్యాలకు చేరుకున్నారు. అనేక చోట్ల ఇళ్లు, వ్యాపార సంస్థల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. చెన్నై ప్రజలు ఎంతగానో ఇష్టపడే అందమైన పనగల్ పార్కు అందవిహీనంగా మారిపోయింది. పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు మూడు రోజులు పడుతుందని విద్యుత్‌శాఖా మంత్రి తంగమణి ప్రకటించారు. మంగళవారం సాయంత్రానికి నగరంలో పాక్షికంగా విద్యుత్ పునరుద్ధరణ చేశారు. తిరువొత్తియూరు, ఎన్నూరులలో సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం ఒక్కరోజునే చెన్నైలో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాంచీపురం పుదూరు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న 9 మందిని మంగళవారం సాయంత్రం స్థానిక గజ ఈతగాళ్లు రక్షించారు. చెంగల్పట్టు జిల్లాలో వెయ్యి ఇళ్లు నీటమునిగాయి.తుపాను తాకిడితో నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియంగా మారిపోయాయి. అరలీటర్ పాల పాకెట్టు ధర రూ.50 పలికింది. తుపాను బాధితుల సహాయార్థం రెండు నౌకల్లో ఆహార పదార్థాలు చెన్నైకి చేరుకున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు చెన్నై నగరాన్ని వణికించిన వర్దా తుపాను తీరం దాటి సోమవారం అర్ధరాత్రి కర్ణాటక వైపు పయనించినా రాష్ట్రంలో మరో రెండురోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాలచంద్ర¯ŒS మంగళవారం తెలిపారు. చెన్నైతోపాటూ ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో విద్యాసంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
సాక్షి, అమరావతి: వర్దా తుపాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. డిసెంబర్14, 15వ తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రద్దయిన రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 14వ తేదీన: 12616 ఢిల్లీ ఎస్ రోహిలా– చెన్నై సెంట్రల్ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, 12622 న్యూఢిల్లీ– చెన్నై సెంట్రల్ తమిళనాడు ఎక్స్‌ప్రెస్, 57273 హుబ్లి– తిరుపతి ఇంటర్సిటీ ప్యాసింజర్ 15వ తేదీన..: 16094 లక్నో– చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, 12296 పాటలీపుత్ర– బెంగళూరు సిటీ సంగమిత్ర ఎక్స్‌ప్రెస్, కాచీగూడ – చెంగల్పట్టు ప్రత్యేక రైలు ప్రయాణీకుల రద్డీని దృష్టిలో పెట్టుకొని కాచీగూడ– చెంగల్పట్టు మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక రైలు (నెంబర్ 07652) 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు కాచిగూడలో బయలుదేరి రాత్రి 7.10కి చెంగల్పట్టు చేరుకుంటుంది.