ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు
ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు
Published Wed, Mar 1 2017 10:15 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
- పరిసరాలు శుభ్రంగా లేకపోతే చర్యలు
– రైల్వే డీఆర్‌ఎం అరుణాసింగ్
కర్నూలు (రాజ్‌విహార్): పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాదు డివిజినల్ మేనేజర్ అరుణాసింగ్ హెచ్చరించారు. 3వ తేదీన జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ పర్యటన సందర్భంగా బుధవారం ఆమె హైదరాబాదు నుంచి ప్రత్యేక రైలులో పరిశీలించుకుంటూ కర్నూలు చేరుకున్నారు. సిటీ స్టేషన్‌తోపాటు కృష్ణానగర్ కోట్లా హాల్ట్, దుపాడు, ఉలిందకొండ, వెల్దుర్తి, డోన్ తదితర స్టేషన్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే సహించబోమన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు, ఆర్‌ఓ ప్లాంట్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అన్ని భాగాల డివిజన్ అధికారులు కర్నూలు స్టేషన్ మేనేజర్ మక్బుల్ హుసేన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement