ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్-కాకినాడ (07011/07012) స్పెషల్ ట్రైన్ ఈ నెల 13వ తేదీ రాత్రి 8.30 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది కాజీపేట, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడుదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది.