వేసవికాలం శెలవుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - గౌహతీ - సికింద్రాబాద్‌కు గుంటూరు రైల్వే స్టేషను మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడుపుతున్నట్లు అసిస్టెంట్ కమర్షియల్ మేనేజరు వి సత్యనందరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నెం 07149 సికింద్రాబాద్ - గౌహతీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం అనగా ఎప్రిల్ 22,29 మే 6,13,20,27 తేదిలలో సికింద్రాబాద్‌లో 07.30కి బయలుదేరి గుంటూరుకు 12.40కి వచ్చి బయలుదేరి ఆదివారం (రెండవరోజు) 08.45కి గౌహతీ చేరుకుంటుంది.
ట్రైన్ నెం 07150 గౌహతీ-సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి సోమవారం అనగా ఎప్రిల్ 25, మే 2,9,16,23,30 తేదిలలో గౌహతీలో 06.15కి బయలుదేరి బుధవారం (రెండవరోజు) 01.55కి వచ్చి బయలుదేరి సికింద్రాబాద్‌కు 09.15కి చేరుకుంటుంది. రిజర్వేషన్ ప్రయాణికుల కోసం ఒక ఎసీ టూటైర్, మూడు ఎసీ త్రీటైర్, 12 స్లీపర్ కోచ్‌లు సాదరణ ప్రయాణికుల కోసం రెండు ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లతో ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా వి సత్యానందరావు తెలిపారు.