
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): నా భూమి.. నా దేశం ప్రచారంలో భాగంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అమృత్ కలశ్‌యాత్ర ప్రత్యేక రైలు బయలు దేరింది. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ జెండా ఊపి రైలును సాగనంపారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు నిర్వహిస్తున్న అజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘నా భూమి.. నా దేశం’ పేరుతో అక్టోబర్ 30, 31 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1,100 మంది వలంటీర్లు 824 కలశాలతో రైలులో బయలు దేరారు. ఈ సందర్భంగా 750 మంది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 1.5. కి.మీ. పొడవు జాతీయ జెండాతో భారత్ మాతాకు జై.. అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment