రాయ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో స్టాంప్‌లు వేస్తున్న అధికారులు
రాయ్‌పూర్: రైళ్ల పునరుద్ధణ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన రాజధాని ప్రత్యేక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మధ్యాహ్నం చత్తీస్‌గడ్ చేరుకుంది. రైలు దిగిన ప్రయాణికులతో రాయ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో సందడి వాతావరణం నెలకొంది. ప్రయాణికులను రైల్వేస్టేషన్ నుంచి క్వారెంటైన్‌ను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చెరగని సిరాతో ప్రయాణికుల అరచేతిపై క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. స్పష్టంగా కనిపించేలా పెద్ద స్టాంప్‌తో కుడి చేతిపై ముద్రిస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత స్వస్థలానికి రావడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. రైలులో ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. ‘ప్రయాణం బాగుంది. సరైన ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటించామ’ని ప్రయాణికులు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం బయలుదేరిన 8 ప్రత్యేక రైళ్లు గమ్యానికి చేరుకున్నాయి. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి.. )
చత్తీస్‌గఢ్‌లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. కేంద్ర వైద్యారోగ్య తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు చత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 54 మంది కోలుకున్నారు. కోవిడ్-19 కారణంగా రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. (ప్రధాని మోదీ ప్రసంగం.. అర్థం ఏంటో!)
Comments
Please login to add a commentAdd a comment