సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-కొల్లాం స్టేషన్‌ల మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-కొల్లాం (07625) ప్రత్యేక రైలు ఈ నెల 14న సాయంత్రం 3.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30కు కొల్లాం చేరుకుంటుందన్నారు.
తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 15న రాత్రి 11.50 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి రెండవరోజు తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, కట్పడి, జోలార్‌పట్టి, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పలక్కాడ్, త్రిశూర్, ఆలువా, ఎర్నాకులం, కొట్టాయం, తిరువళ్ల, చింగన్నూర్, కాయంకులళం స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలుకు బుధవారం (డిసెంబర్ 10) నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమవుతుందని సీపీఆర్వో వెల్లడించారు.
అయ్యప్పస్వాముల కోసం శబరిమలకు ప్రత్యేక రైలు
Published Wed, Dec 10 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement