
జూన్ 5న 'సికింద్రాబాద్- పట్నా' ప్రత్యేక రైలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ - పట్నా మధ్య ప్రత్యేక రైలును నడుపనున్నారు. నంబర్ 02791 రైలు జూన్ 5న ఉదయం 8.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 గంటలకు పట్నా చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో నంబర్ 02792 రైలు జూన్ 7 మధ్యాహ్నం 1.30 గంటలకు పట్నాలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, నాగ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తుంది.