హైదరాబాద్–కాకినాడ మధ్య రెండు రైళ్లు
Published Thu, Jun 1 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
సాక్షి, అమరావతి: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్–కాకినాడ టౌన్ మధ్య జూన్ 1, 4వ తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్వో బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 1న హైదరాబాద్–కాకినాడ టౌన్ (07005) రైలు, జూన్ 4న కాకినాడ టౌన్–హైదరాబాద్ (07006) రైలు వయా గుంటూరు మీదుగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Advertisement
Advertisement