సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో సబ్‌వే ఏర్పాట్ల కారణంగా రెండు రోజుల పాటు రైల్వే సర్వీసులకు అంతరాయం కలగనుంది. నల్లగొండ జిల్లా పరిధిలోని రామన్నపేట, వలి గొండ, నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్లకు సంబంధించిన లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద పరిమిత ఎత్తులో సబ్‌వేలు ఏర్పాటు చే స్తున్న కారణంగా ఈనెల 7, 8 తేదీల్లో ఆయా స్టేషన్ల గుండా వెళ్లే రైలు సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.శ్రీరాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ రెండు రోజు ల్లో రాత్రి 7:45 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:45 నిమిషాల వరకు రైలు సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా ఈ సబ్‌వేల ఏర్పాటు పనుల కారణంగా నాలుగు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాచిగూడ-మిర్యాలగూడ-పిడుగురాళ్ల డెమూ ప్యాసింజర్ రైలు ఈనెల 7వ తేదీన, పిడుగురాళ్ల-మిర్యాలగూడ-కాచిగూడ ప్యాసిం జర్ రైలును ఈ నెల 8వ తేదీన రద్దు చేస్తున్నట్టు వెల్లడిం చారు.
అదేవిధంగా ఈనెల 7న కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ-రేపల్లె డెల్టా ప్యాసింజర్‌ను నల్లగొండ, నడికుడి రూటు నుంచి కాకుండా ఖాజీపేట, విజయవాడల మీదుగా గుంటూరు స్టేషన్‌కు మళ్లించి నట్టు తెలిపారు. అదే రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను నల్లగొండ, నడికుడి, గుంటూరు మీదుగా కాకుండా ఖాజీపేట, ఖమ్మంల మీదుగా విజయవాడకు మళ్లించినట్టు తెలిపారు.
రైల్వే సేవలకు అంతరాయం
Published Sat, Jun 6 2015 11:40 PM | Last Updated on Tue, Aug 21 2018 4:21 PM
Advertisement
Advertisement