గుణుపూర్ రైలుకు పచ్చజెండా | green signal to Gunupur train | Sakshi
Sakshi News home page

గుణుపూర్ రైలుకు పచ్చజెండా

Published Sat, Feb 7 2015 12:26 AM | Last Updated on Tue, Aug 21 2018 4:21 PM

గుణుపూర్ రైలుకు పచ్చజెండా - Sakshi

గుణుపూర్ రైలుకు పచ్చజెండా

పట్టాలెక్కనున్న గుణుపూర్-విశాఖ రైలు
9న ప్రారంభించనున్న రైల్వే మంత్రి

 
విశాఖపట్నం సిటీ: గుణుపూర్-విశాఖపట్నం-గుణుపూర్(58505/06)ప్యాసింజర్ రైలు పట్టాలపై పరుగులు తీసేందుకు తూర్పు కోస్తా రైల్వే శుక్రవారం పచ్చజెండా ఊపింది. గత రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన ఈ రైలు నడిపేందుకు ఇప్పటి వరకూ అనుమతి ఇవ్వలేదు. గతంలోనే ఈ రైలుకు చెందిన రేక్‌లు వచ్చినా ఆ రేక్‌లను ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌లకు వినియోగించారు. ఎట్టకేలకు ఈ కొత్త రైలును పట్టాలెక్కించడంతో ఉత్తరాంధ్ర వాసులు ఊపిరి తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ         సాయంత్రం 6 గంటలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభాక ర్ ప్రభు న్యూఢిల్లీలో  రిమోట్ జెండా ఊపి గుణుపూర్ నుంచి విశాఖ రైలును ప్రారంభిస్తారు. ఆ రోజు ప్రత్యేక రైలుగా నడుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచీ రెగ్యులర్‌గా నడిచేందుకు ఏర్పాట్లు చేశారు.

విశాఖ-గుణుపూర్(58506) ప్యాసింజర్ రోజూ విశాఖలో ఉదయం 7 గంటలకు బయల్దేరి నౌపడ జంక్షన్‌కు 10. 50 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు గుణుపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో గుణుపూర్-విశాఖ(58505) ప్యాసింజర్ రోజూ గుణుపూర్‌లో మధ్యాహ్నం 2.25 గంటలకు బయల్దేరి నౌపడ జంక్షన్‌కు సాయంత్రం 5 గంటలకు చేరుతుంది. తిరిగి 5.25 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.40 గంటలకు విశాఖకు చేరుతుంది.

ఈ రైలు సింహాచలం, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, గుణుపూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైల్లో మొత్తం 12 బోగీలుంటాయి. అన్నీ జనరల్ బోగీలేనని ప్రయాణికులు ఈ రైలును వినియోగించుకోవాల్సిందిగా వాల్తేరు సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్‌యాదవ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement