తప్పిన పెనుప్రమాదం | gunupur-visakha passenger escapes accident | Sakshi
Sakshi News home page

తప్పిన పెనుప్రమాదం

Published Wed, Apr 22 2015 5:12 PM | Last Updated on Tue, Aug 21 2018 4:21 PM

పాసింజర్ రైలు(ఫైల్) - Sakshi

పాసింజర్ రైలు(ఫైల్)

శ్రీకాకుళం: రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. అదే సమయంలో గుణుపూర్-విశాఖపట్టణం పాసింజర్ రైలు వస్తోంది. ఆర్టీసీ బస్సు ఆగిపోయిన విషయాన్ని గమనించిన రైలు డ్రైవర్ సకాలంలో స్పందించి ట్రైన్ ఆపడంతో ప్రమాదం తప్పింది.

దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గేటు కీపర్ గేటు వేయడం మరిచిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గేటు కీపర్ పై  ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement