Hyderabad Rains: Child Died After Falling Into Manhole At Secunderabad, Details Inside - Sakshi
Sakshi News home page

Hyderabad Rains: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి

Published Sat, Apr 29 2023 9:12 AM | Last Updated on Sat, Apr 29 2023 11:54 AM

Child Died After Falling Into Manhole At Secunderabad - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: భారీ వర్షం కురిసిన వేళ సికింద్రాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో పడి ఓ చిన్నారి మృతిచెందింది. దీంతో, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్క్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. 

వివరాల ప్రకారం.. నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్‌ కోసం  చిన్నారి మౌనిక బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భారీ వర్షం కారణంగా మ్యాన్‌హోల్‌ మూత తెరిచి ఉండటంతో చిన్నారి అందులో పడిపోయింది. అనంతరం, పార్క్‌లైన్‌ దగ్గర మౌనిక మృతదేహాన్ని డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. కాగా, చిన్నారి ఇలా చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అములుకున్నాయి. ఇక, మ్యాన్‌హోల్‌ తెరిచిపెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే, వర్షం కురుస్తుండగా మౌనిక తన అన్నతో కలిసి షాపునకు వెళ్లింది. ఈ క్రమంలో తన అన్న మ్యాన్‌హోల్‌లో పడిపోతుండగా ఆమె.. అతడిని కాపాడింది. ఈ క్రమంలో చిన్నారి మౌనిక పట్టుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని ఆమె.. సోదరుడు వివరిస్తూ కన్నీరుపెట్టుకున్నాడు. 

ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్ట ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. తార్నాక చౌరస్తాలో భారీగా వరద నీరు చేరుకుంది. పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement