
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తమను సీబీఐ కావాలనే ఇరికించిందని, తమకు బెయిల్ ఇవ్వాలని వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సీబీఐ కోర్టు తమ బెయిల్ పిటిషన్లను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్యకేసులో దర్యాప్తు పూర్తయిందని, సీబీఐ అభియోగ పత్రాన్ని కూడా దాఖలు చేసిందని తెలిపారు. ఈ కేసులో పిటిషనర్లను అక్రమంగా ఇరికించారని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదన్నారు. ఇప్పటికే 5 నెలలకు పైగా జైలులో ఉన్నారని, భాస్కర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. పలుమార్లు జైలు అధికారులు ఆస్పత్రుల్లో ఆయనకు పరీక్షలు కూడా నిర్వహించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment