![TS High Court Hearing On Election To Vacant Posts In Local Bodies - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/28/Telangana-high-court.jpg.webp?itok=PAOyQZbq)
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్ వేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. 220 సర్పంచ్‌లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5364 వార్డు సభ్యుల ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జాప్యంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఎన్నికలైతే నిర్వహించాలి కదా అంటూ వ్యాఖ్యానించింది.
ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. విచారణను ధర్మాసనం.. రెండు వారాలు వాయిదా వేసింది.
చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment