
సాక్షి, హైదరాబాద్: 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంధ విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లు మాత్రమే రాసుకునే అవకాశం ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 27ను సవాల్ చేస్తూ అంధుల అభివృద్ధి, సంక్షేమ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. మూడు లాంగ్వేజ్‌లు రాయాలా.. రెండు లాంగ్వేజ్‌లు రాయాలా.. అనేది అంధులకు ఆప్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్‌ఎస్ అర్జున్‌కుమార్ వాదనలు వినిపించారు. లాంగ్వేజ్‌లు విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమని.. రెండు లాంగ్వేజ్‌లు మాత్రమే చదివితే.. ముందుముందు పోటీ పరీక్షలకు, ఉద్యోగాలకు ఇబ్బందిగా మారుతుందని నివేదించారు. విద్యార్థులు ఇప్పటికే మూడు లాంగ్వేజ్‌లు చదివారని, తుది పరీక్షల్లో వారిని రెండు మాత్రమే రాయాలని ఒత్తిడి చేయడం సరికాదని, ప్రభుత్వ జీవోను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మూడు లాంగ్వేజ్‌లు రాసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో న్యాయమూర్తి.. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment