
సేలం: అకస్మాత్తుగా అనారోగ్యం పాలై మృతి చెందిన భర్తకు ఇంటిలోనే విగ్రహం చేర్పాటు చేసి భార్య పూజలు చేస్తున్న ఘటన సేలంలో చోటు చేసుకుంది. వివరాలు.. సేలంలోని ఏర్కాడు ప్రధాన సాలైలోని, కేంద్ర న్యాయ కళాశాల సమీపంలో ఉన్న అన్నై ఇందిరాగాంధీ నగర్ 3వ అవెన్యూకు చెందిన శశికుమార్. ఇతని భార్య గోమతి. వీరికి కుమారుడు వేల్ కుమార్, కుమార్తె శైలశ్రీ ఉన్నారు.
బ్యాంకు మేనేజర్‌గా పని చేసి శశికుమార్ పదవీ విరమణ పొందారు. తర్వాత సమాజ సేవలో పాల్గొనేవారు. ఈ స్థితిలో గత 2019లో శశికుమార్ అనారోగ్యం కారణంగా ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగింది. భర్తను కోల్పోయిన గోమతి, తన భర్త ఇంటి ప్రాంగణంలోనే ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, అందులో శశికుమార్ విగ్రహాన్ని ఉంచి.. నిత్యం ఆయనకు పూజలు చేస్తోంది. ఈ పూజలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment