ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముని చిన్న నమూనా విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన గతంలో అయోధ్య రామాలయానికి రామ్‌లల్లా విగ్రహాన్ని తయారు చేశారు. యోగిరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో బాలరాముని చిన్న నమూనా రూపానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
యోగిరాజ్ ట్విట్టర్‌లో తాను రాతితో రామ్‌లల్లా చిన్న విగ్రహాన్ని తయారు చేశానని తెలిపారు. వెండి సుత్తితో, బంగారు ఉలితో రామ్‌లల్లా కళ్లను చెక్కానని పేర్కొన్నారు. ఈ భూమిపై తాను ఎంతో అదృష్టవంతుడినని, తన పూర్వీకుల ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు.
అరుణ్ యోగిరాజ్ 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా యోగిరాజ్ రూపొందించారు. అలాగే కేదార్‌నాథ్‌లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూర్ జిల్లాలోని చుంచన్‌కట్టేలో 21 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను యోగిరాజ్ తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment