అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు | Ayodhya Ram lala Mandir Darshan Aarti New Time Table | Sakshi
Sakshi News home page

అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు

Published Wed, Oct 2 2024 7:55 AM | Last Updated on Wed, Oct 2 2024 11:33 AM

Ayodhya Ram lala Mandir Darshan Aarti New Time Table

అయోధ్య: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది.  

నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని ట్రస్ట్‌ పేర్కొంది. తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార ఆరతి  ఉంటుందని సమాచారం. ఇక రామ్‌లల్లా దర్శనం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలభోగం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయ తలుపులు ఐదు నిమిషాల పాటు మూసివేయనున్నారు.

నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్‌ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు ట్రస్ట్‌ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దర్శన వేళల్లో చేసిన నూతన మార్పుల విషయానికొస్తే.. బాలభోగం అనంతరం ఉదయం 9:05కు ఆలయ తలుపులు  తెరుస్తారు. 11:45 వరకు దర్శనాలు ఉంటాయి. 11:45 నుండి 12:00 వరకు ప్రభువు  ఏకాంతం ఉంటుంది. తిరిగి 12:00 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. ఆలయంలో స్వామివారు మధ్యాహ్నం 12:15 గంటలకు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులను 12:30 నుండి 1:30 వరకు మూసివేస్తారు. అదే సమయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.

మధ్యాహ్నం 1:30కి ఆలయంలోని తలుపులు తెరుస్తారు. దేవతా హారతి నిర్వహిస్తారు. దర్శనాలు మధ్యాహ్నం 1:35 నుండి ప్రారంభమై, సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది.  అనంతరం ఐదు నిమిషాల పాటు ఆలయ తలుపు మూసివేస్తారు. ఆ తర్వాత 4:05 నుంచి 6:45 వరకు నిరంతర దర్శనం ఉంటుంది. దీని తరువాత సాయంత్రం 6:45 నుండి 7:00 గంటల వరకు 15 నిమిషాల పాటు స్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో భోగ్ అందిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు హారతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9:00 గంటలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. 9:30 గంటలకు స్వామివారికి ప్రసాదం సమర్పించి, శయన హారతి  అందిస్తారు. అనంతరం 9:45 గంటలకు స్వామివారు నిద్రించేందుకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.

ఇది కూడా చదవండి: దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement