![Ayodhya Ram Mandir this Idol was First Selected - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/24/ram-lalla.jpg.webp?itok=HVkHvXqB)
పుణ్యక్షేత్రమైన అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ మందిరంలో కొలువైన బాలరాముడు భక్తులను మైమరపిస్తున్నాడు. రామ్‌లల్లా విగ్రహంలోని కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్‌లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావించిందట. ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్ త్వరలో వెల్లడించనుంది.
జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment