
కొత్తూరులో ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహాన్ని పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేశారు. గుడిపల్లి మండలంలోని కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం
Comments
Please login to add a commentAdd a comment