kothuru
-
ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
కొత్తూరు: ప్రమాదవశాత్తు ఐదేళ్ల విద్యార్థికి మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. ఎంఈవో కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇమామ్, షభానాబేగంలకు ముజామిల్ (5)తో పాటు మూడేళ్ల వయస్సున్న కూతురు ఉంది. ముజామిల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 9.30 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ పక్కన విద్యార్థికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు మంటలను ఆర్పేసి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, షాద్‌నగర్ ఆర్డీఓ రాజేశ్వరితో పాటు ఎంఈవో కృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పాఠశాల సమీపంలో చెత్తకు పెట్టిన నిప్పు వద్ద బాధిత విద్యార్థితో పాటు మరో బాలుడు ఆడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఎంఈవో తెలిపారు. -
కుప్పంలో టీడీపీ దౌర్జన్యకాండ: వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేశారు. గుడిపల్లి మండలంలోని కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
సిగ్నల్ జంప్ చేసిన వాహనాలు.. ఒకరి మృతి
మైలార్‌దేవ్‌పల్లి: సిగ్నల్ జంప్ చేసిన రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రయాణగుట్ట నుంచి వస్తున్న స్వరాజ్ మజ్డా వాహనం బంజారాహిల్స్ వెళ్తుంది. కాటేదాన్ నుంచి వస్తున్న ఆటో చంద్రయాణగుట్ట వైపు వెళ్తుంది. ఈ ఆటోలో డ్రైవర్ అర్మాజ్(19)తో పాటు మహ్మద్ గౌస్(20) ప్రయాణిస్తున్నాడు. ఈ రెండు వాహనాలు దుర్గానగర్‌కు వచ్చే సమయానికి రెడ్ సిగ్నల్ పడింది. ఇరువురు డ్రైవర్లు నిర్లక్ష్యంగా సిగ్నల్ జంప్ చేయడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు గాయపడ్డారు. స్వరాజ్ మజ్డా డ్రైవర్ దావూద్(55) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్ అర్మాజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబరు బైక్‌కు పెట్టుకుని కొత్తూరు: చలానాలు తప్పించుకోవడంలో భాగంగా కొందరు ఇటీవల కాలంలో ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరో వాహనానికి వేసుకోవడం పరిపాటిగా మారింది. తీరా చాలానాలు వచ్చే దాక విషయం తెలియడం లేదు. ఇలాంటి ఘటనే మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గూడూరు గ్రామానికి చెందిన పెండ్లిమడుగు విజయనిర్మల పేరు మీద మారుతి బ్రిజాకారు ఉంది. కాగా ఇదే నెంబర్‌ను ఓ యువకుడు బైకుకు పెట్టుకున్నాడు. ఈ నెల 17న షాద్‌నగర్ ఎక్స్‌రోడ్‌లో యువకుడు హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ పోలీసులు బైకు ఫొటోను తీసి చలానా వేయడంతో కారు యజమానురాలికి మెసేజ్ వచ్చింది. దీంతో తనది కారు అయినప్పటికీ బైకు చలానా ఎందుకు వచ్చిందని ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్‌ను వివరణ కోరగా తప్పుడు నంబర్ ప్లేట్లు పెట్టుకున్నట్లు తేలితే వాహనం యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. బ్రీజా కారు నంబర్‌ను బైకు పెట్టుకున్న విషయాన్ని విచారిస్తామన్నారు. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదకరం నిర్లక్షంగా వాహనం నడిపి ఓ వ్యక్తి గాయపడేలా చేశాడో బైకర్. ట్రాఫిక్ సిగ్నల్‌ను సమీపిస్తున్న సమయంలో ర్యాష్‌గా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. మైలార్దేవపల్లి, దుర్గానగర్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. Rash driving when approaching a traffic signal is dangerous. At Durganagar Junction, Mailardevapalli.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/rovPPPhZhs — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 23, 2021 -
చదువుకుంటానని మేడపైకి వెళ్లి..
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : రోజూ మాదిరిగానే మేడ మీదకు చదువుకుందామని వెళ్లిన విద్యార్థి విద్యుత్ షాక్ గురై మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ నాయనా.. నువ్వెంతో ప్రయోజకుడవుతావని, ఎన్నో కలలు కన్నాం.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు పోయావా’ అంటూ.. వీరు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ విషాద సంఘటన గురువారం కొత్తూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... కొత్తూరు గ్రామానికి చెందిన సారిపల్లి రామకృష్ణ, లక్ష్మి దంపతుల మొదటి సంతానం భార్గవ్(14) కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ తన ఇంటి శ్లాబ్‌పై అందరి పిల్లలతో కలిసి చదువుకుంటుంటాడు. అదే మాదిరిగా గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ బల్బుకు విద్యుత్ తీగతో కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితి చేరుకున్న అతడిని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక సీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ వైద్యం అందించేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించిన వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సమాచారం మేరకు సీఐ ఎల్ సన్యాసినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. -
టైరు పంక్చరై..లారీని ఢీకొట్టిన కారు
కొత్తూరు: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి పొత్తిళ్లలో పడుకొని ఉన్న ఏడాది వయసున్న చిన్నారికి తల్లిని శాశ్వతంగా దూరం చేసింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం మండల కేంద్రంలోని బైపాస్ వైజంక్షన్ కూడలి సమీపంలో చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామానికి చెందిన దుష్యంత్‌రెడ్డి(35), ఆయన తమ్ముడు యశ్వంత్రెడ్డిలు హైదరాబాద్‌లోని లింగోజిగూడ, సరూర్‌నగర్ ప్రాంతంలో ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాగా ఇటీవల స్వగ్రామంలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తికావడంతో ఈ నెల 7న గృహ ప్రవేశం చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్ల కోసం దుష్యంత్‌రెడ్డితో పాటు తల్లి జయశ్రీ,, దుష్యంత్‌రెడ్డి తమ్ముడి భార్య స్వాతి(28), ఆమె పెద్ద కుమారుడు పృథ్విక్రెడ్డి(8) చిన్న కుమారుడు రేవంత్‌రెడ్డి(01)లతో కలిసి కారులో గ్రామానికి బయలుదేరారు. కాగా కొత్తూరు వై జంక్షన్ సమీపంలోకి రాగానే కారు ముందు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్‌పై నుండి దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న స్వాతి, పృథ్విక్రెడ్డిలు కారులో నుండి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా ఆయన తల్లి జయశ్రీ, చిన్నారి బాలుడు రేవంత్‌రెడ్డి(1) స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ సుధాకర్ అక్కడకు చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడకు చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై నుజ్జునుజ్జయిన కారును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. -
కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం కొత్తూరులో కురుబ కరిబసప్ప అనే రైతుకు చెందిన 20 గొర్రె పిల్లలు శనివారం వీధి కుక్కల దాడిలో మృతి చెందాయి. ఉదయమే మేత కోసం గొర్రెల మందను అడవికి తోలుకెళ్లగా.. వాటి పిల్లలను మాత్రం గ్రామంలోనే వదిలివెళ్లినట్లు బాధితుడు తెలిపారు. వీధి కుక్కలు ఒక్కసారిగా గొర్రె పిల్లలపై దాడి చేసి చంపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇటీవలే వీధి కుక్కల దాడిలో రమేష్ అనే విద్యార్ధి తీవ్రంగా గాయపడి కర్ణాటకలోని బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో రెండు సంఘటనలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
కొత్తూరు: మండలంలోని బమ్మిడి గ్రామానికి చెందిన 75 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. గ్రామానికి చెందిన వంబరవిల్లి శ్రీనివాసరావు, ఆర్.శిమ్మయ్య, వైరాగి, ఏ.సంజీవు, ఎస్.కృష్ణమూర్తి, ఏ.శిమ్మన్న, ఎల్.అప్పలనాయుడు, పి.లక్షణరావు తదితరులు ఆదివారం ఆదివారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ప్రజా సమస్యలు, ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సారిపల్లి ప్రజాదరావు, రైతు విభాగం జిల్లా నేత రేగేటి కన్నయ్య, వైద్యులు ఎం.తిరుపతిరావు. సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
మండే ఎండ.. కుండే అండ
► ఇన్ముల్‌నర్వలో ఊపందుకున్న విక్రయాలు ఇన్ముల్‌నర్వ (కొత్తూరు): పేదోడికి వేసవికాలం వచ్చిందంటే చాలు మట్టికుండలు గుర్తుకొస్తాయి. పేదలతో పాటు వైద్య పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ వైద్యులు సూచించిన మేరకు ఫ్రిజ్ కంటే ఎక్కువగా వేసవిలో మట్టి కుండలోని చల్లటి నీటిని తాగేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముందుగానే తమ ప్రతాపాన్ని చూపడంతో ప్రజలు ఉక్కపోత, దాహంతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా వివిధ పనులపై బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరుకోగానే ఉక్కపోతల కారణంగా చల్లని నీటిని తాగేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. దీంట్లో భాగంగానే వేసవి దృష్ట్యా మార్కెట్లో ఫ్రిజ్‌ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పేదలు కుమ్మరులు తయారు చేసిన కుండలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో చల్లబర్చే నీటి కంటే మట్టి కుండలోని నిల్వ ఉన్న నీటిని తాగితే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సైతం పలు సందర్భాల్లో సూచిస్తున్నారు. ధరలు తక్కువగా ఉండడంతో పేదలతో పాటు వ్యాపారులు కూడా ప్రకృతి సహజ సిద్దంగా తయారు చేసిన కుండలను ఎక్కువగా కొనుగోలు ఆసక్తి కనబర్చుతున్నారు. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కుమ్మరులు కూడా యంత్రాలకు పోటీగా తమ హస్త నైపుణ్యంతో పలు రూపాల్లో కుండలను తయారు చేస్తున్నారు. కుండల రకాలను, సైజులను బట్టి రూ. 50 నుండి రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. ప్రోత్సాహం లేక తగ్గుతోన్న ఆదరణ మండలంలో ఒకప్పుడు ప్రతి గ్రామంలో కుమ్మరులు కుండలు తయారు చేస్తూ తమ కులవృత్తిపై ఆధారపడి జీవిస్తుండేవారు. కాగా మండలంలో వచ్చిన రియల్‌బూమ్, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం ఇన్ముల్‌నర్వ, సిద్ధాపూర్ గ్రామాల్లో మాత్రమే కుండలను తయారు చేస్తున్నారు. ఇన్ముల్‌నర్వ గ్రామంలో తయారు చేసే కుండలను వారు సమీపంలో జేపీ దర్గా ఆవరణలో విక్రయిస్తుంటారు.ఇక్కడ స్థానికులే కాకుండా హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంతో ఇష్టంగా మట్టికుండలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. దీంతో పలువురికి కుండల తయారీ ద్వారా ఉపాధి లభిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలగర్భంలో కలిసిపోతున్న కులవృత్తులకు తగిన ప్రోత్సాహం అందించాలని కుమ్మరులు కోరుతున్నారు.