కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి | 20 sheeps dies of dog byte | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి

Published Sat, Jun 24 2017 11:39 PM | Last Updated on Sat, Sep 29 2018 3:55 PM

కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి - Sakshi

కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి

బొమ్మనహాళ్‌ (రాయదుర్గం) : బొమ్మనహాళ్‌ మండలం కొత్తూరులో కురుబ కరిబసప్ప అనే రైతుకు చెందిన 20 గొర్రె పిల్లలు శనివారం వీధి కుక్కల దాడిలో మృతి చెందాయి. ఉదయమే మేత కోసం గొర్రెల మందను అడవికి తోలుకెళ్లగా.. వాటి పిల్లలను మాత్రం గ్రామంలోనే వదిలివెళ్లినట్లు బాధితుడు తెలిపారు. వీధి కుక్కలు ఒక్కసారిగా గొర్రె పిల్లలపై దాడి చేసి చంపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామంలో ఇటీవలే వీధి కుక్కల దాడిలో రమేష్‌ అనే విద్యార్ధి తీవ్రంగా గాయపడి కర్ణాటకలోని బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో రెండు సంఘటనలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement