Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Means Telugu Drama Party Says YS Jagan1
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్‌ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్‌ అన్నారు... చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్లు, రేషన్‌ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్‌ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్‌, బకాయిలు పెండింగ్‌. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, రాజధాని పనులు.. లిక్కర్‌ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్‌ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్‌ అన్నారు.క్లిక్‌ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన

Jagan Gollaprollu Penukonda YSRCP Leaders Meeting Key Comments Updates2
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్‌ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్‌ ఉండి ఉంటేనా..

Hamas Gaza chief Mohammed Sinwar eliminated by Israel Army says Netanyahu3
హమాస్‌కు చావు దెబ్బ.. ఇజ్రాయెల్‌ చేతిలో గాజా చీఫ్‌ మహ్మద్‌ సిన్వర్‌ హతం

జెరూసలేం: ఇజ్రాయెల్‍-హమాస్‍ యుద్ధంలో ఇజ్రాయెల్‌ పైచేయి సాధించింది. హమాస్‌ను చావు దెబ్బ కొట్టింది. హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిందని బుధవారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మే 14న ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో హమాస్ చీఫ్ తీవ్రంగా గాయపడ్డారని నివేదికలు వచ్చాయి. ఆ సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ దాడిలో మహమ్మద్ సిన్వార్‌ మరణంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.ఈ క్రమంలో గాజాలో హమాస్‌కు మిగిలి ఉన్న చివరి టాప్ కమాండర్లలో ఒకరైన మహమ్మద్ సిన్వర్ మే 14న ఇజ్రాయెల్ రక్షణ దళాలు జరిపిన దాడుల్లో మరణించినట్లు ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ధ్రువీకరించారు. ముహమ్మద్ సిన్వార్ హమాస్‌ అధినేత యాహ్వా సిన్వార్‌ సోదరుడు. గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్‌ దళాల చేతిలో సిన్వార్‌ మృతి చెందాడు.🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.Terrorism isn't managed it’s erased.This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 2025హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ లక్ష్యంగా దక్షిణగాజాలోని ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. గతేడాది అక్టోబర్ లో ఐడీఎఫ్‌ జరిపిన దాడిలో యాహ్యా సిన్వర్ హతమైన తర్వాత మహమ్మద్ సిన్వర్ అనధికారికంగా హమాస్ నేతగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆరుగురు పాలస్తీనీయన్లు మృతిచెందటంతో పాటు.. 40 మంది గాయపడినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖాన్ యూనిస్ నగరంలోని ఐరోపా ఆస్పత్రి కింద భూగర్భంలో కొనసాగుతున్న హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో మహమ్మద్‌ సిన్వర్‌ మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రకటనతో హమాస్‌కు చావు దెబ్బ తగిలినట్లైంది.

Political Analysts On Pawan Double Stand Cine Industry4
అధికారం ఉంది కదా అని అడ్డంగా నడుస్తున్నారా?

ఏపీలోని సినిమా థియేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే కక్ష సాధింపు చర్యలు కొనసాగడం గమనార్హం. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ థియేటర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనకు సంబంధించిన వారి థియేటర్లలోకి తనిఖీలు పేరుతో వెళ్లినా అక్కడ తూతూ మంత్రంగానే సోదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులకు తనిఖీల ఆదేశాలు వెళ్లాయి.మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ నేపథ్యంలో తనిఖీలు షురూ చేశారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ పవన్‌ ద్వంద్వ వైఖరి అనేది ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.కూటమి నేతల థియేటర్లలో తనిఖీలు ఏవి?డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు సరే కానీ, ఇక్కడ ఎవరి థియేటర్లని తనిఖీలు చేయాలనే ఆదేశాలు కూడా ఆఫ్ ద రికార్డు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో టీ\డీపీ, జనసేన నేతల థియేటర్ల వైపు అదికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ ఆ థియేటర్లకు పొరపాటున వెళ్లినా నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి ఫైర్, రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్ లీజుకు తీసుకున్న థియేటర్లలోనే తనిఖీలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. మరి అప్పట్నుంచి థియేటర్లలో ఎందుకు తనిఖీలు చేపట్టలేదనేది ప్రధాన ప్రశ్న. థియేటర్లలో పారిశుధ్యం బాగా లేదని, తినుబండారాలు ధరలు ఎక్కువగా ఉన్నాయని, కొంతమంది గుత్తాధిపత్యం నడుస్తోందని ప్రధానంగా ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఈ తనిఖీలు నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.బంద్ కుట్ర చేసింది జనసేన నేతని తేలినా..సినిమా థియేటర్ల బంద్ డ్రామాకు తెరలేపింది జనసేన నేత అని తేలినా, థియేటర్లలో తనిఖీలు మాత్రం ఆగడం లేదు. కక్ష గట్టి థియేటర్లలో తనిఖీలు చేసేస్తున్నారు. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల థియేటర్లలోనే తనిఖీలు చేస్తున్నారు. టీడీపీ నేతల చేతుల్లో అత్యధికంగా సినిమా థియేటర్లు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. టీడీపీ, జనసేన నేతల థియేటర్లలో తనిఖీలు చేపట్టకుండా కొందరిని మాత్రమే టార్గెట్ చేసి తనిఖీలు చేస్తున్నారు.సినిమా వాళ్ల పట్ల, సినిమా పట్ల ప్రభుత్వ జోక్యం ఏమిటని గతంలో ఊగిపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం రగిలిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ‘రగులుతోంది మొగలి పొద’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నటుడు పవన్. అధికారం ఉంది కదా అని అడ్డంగా వెళ్లిపోయినా నడుస్తుందని మన డిప్యూటీ అనుకుంటున్నట్లు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Mp Avinash Reddy Slams Chandrababu Naidu Over Ysr District Tdp Maha Nadu  Meeting5
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’

సాక్షి,వైఎస్సార్‌ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్‌ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్‌ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్‌ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్‌ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్‌. వైఎస్‌ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్‌ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు.

Small Price, High Impact: Smartest Investment Of Each Franchise In IPL 20256
IPL 2025: రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ.. ఆ హీరోలు వీరే..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్‌ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్‌ సూర్యవంశీ. రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్‌ తొలి మ్యాచ్‌ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.పైసా వసూల్‌ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్‌ ఆర్య. ఇతగాడిని పంజాబ్‌ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్‌పై పంజాబ్‌ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరగదీశాడు. పంజాబ్‌ ఈ సీజన్‌లో టేబుల్‌ టాపర్‌గా నిలవడంలో ప్రియాంశ్‌ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతను 183.55 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్‌ రికెల్టన్‌. ముంబై ఇండియన్స్‌ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రికెల్టన్‌ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్‌ల్లో 150.97 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు.ఈ సీజన్‌లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్‌ వర్మ. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 166.20 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. లోయల్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అనికేత్‌ అంచనాలకు మించి భారీ హిట్టింగ్‌ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్‌, అభిషేక్‌, ఇషాన్‌ కిషన్‌, క్లాసెన్‌ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్‌లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్‌కే తరఫున ఆయుశ్‌ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్‌లే ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (2 కోట్లు), ఢిల్లీ ఆల్‌రౌండర్‌ విప్రాజ్‌ నిగమ్‌ (50 లక్షలు), బౌలర్లలో ఎల్‌ఎస్‌జీకి చెందిన దిగ్వేశ్‌ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్‌ (30 లక్షలు), కర్ణ్‌ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు.

Chandrababu comments on Maha Nadu occasion create a stir7
మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం

సాక్షి,వైఎస్సార్‌: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Poor Kamal Haasan Siddaramaiah On Kannada Language Row8
పాపం కమల్‌ హాసన్‌.. సిద్ధరామయ్య సెటైర్లు

బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్‌ కామెంట్‌పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్‌ హాసన్‌కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్‌ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్‌ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్‌ కుమార్‌ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్‌ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్‌ లైఫ్‌ చిత్ర(Thug Life) ఈవెంట్‌లో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్‌పై ఇటు రాజకీయంగా, అటు సోషల్‌ మీడియాలోనూ కమల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్‌ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్‌లో కమల్‌ హాసన్‌, శింబు, త్రిష, అభిరామి లీడ్‌ రోల్స్‌లో నటించిన థగ్‌ లైఫ్‌ సినిమా జూన్‌ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్‌ కమల్‌.. నల్ల ఇంకు పోస్తాం

Shah Rukh Khan As Brand Ambassador of Candere9
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Vijay Antony Latest Movie Maargan Telugu Trailer Out Now10
విజయ్ ఆంటోని మిస్టరీ థ్రిల్లర్‌.. తెలుగు ట్రైలర్‌ చూశారా?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమాకు కోలీవుడ్‌లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన లియో జాన్‌ పాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే డైరెక్టర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఇటీవల మార్గన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. అయితే మూవీ పాత్రకు సంబంధించిన గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సందర్భంగా మీ గెటప్‌ గురించి ఏమైనా రివీల్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మీకు సినిమా మొత్తం ఇక్కడే చూపిస్తామని నవ్వుతూ మాట్లాడారు. ఒకవేళ ఇండియాలో నేనే గనక రిచ్ అయ్యుంటే.. నా సినిమాలన్నీ ఉచితంగా ప్రదర్శించేవాడినని విజయ్ అన్నారు. ఇది విన్న అభిమానులు విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మార్గన్‌ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్‌ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్‌లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement