‘కృష్ణ’లో బాలరాముని పోలిన శ్రీమహావిష్ణువు! | Vishnu Idol Found in Krishna River with Features of Ayodhya Ram Lalla | Sakshi
Sakshi News home page

Vishnu Idol: ‘కృష్ణ’లో బాలరాముని పోలిన శ్రీమహావిష్ణువు!

Published Wed, Feb 7 2024 9:36 AM | Last Updated on Wed, Feb 7 2024 10:46 AM

Vishnu Idol Found in Krishna River with Features of Ayodhya Ram Lalla - Sakshi

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయల్పడింది. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయల్పడింది. అయితే నదిలో బయట్పడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని  నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం గమనార్హం. 

ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం గురించి రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్ మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ  విష్ణువు విగ్రహం చుట్టూ  మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలు అందంగా మలిచారు.

ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. అతని పైరెండు చేతులలో శంఖుచక్రాలు ఉండగా, దిగువ చేతులు (‘కటి హస్త’, ‘వరద హస్త’) ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపిస్తాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement