
విశాఖ : విగ్రహాల ధ్వంసం దుష్ర్పచారంపై తప్పుడు ప్రచారం చేసిన నిందితులను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కలవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఉన్న ఆయన.. నిందితులను కలవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాగా గొలుగొండ ఏటిగైరమ్మపేటలో గణేష్ విగ్రహం ధ్వంసమయ్యిందని కొందరు టీడీపీ నేతలు దుష్ర్పచారం చేశారు. ఏడాది క్రితం విరిగిన విగ్రహం.. ఇప్పుడు ధ్వంసమైనట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేసిన చేసిన నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో కిలాడి నరేష్, పోలిశెట్టి సంతోషం, పోలిశెట్టి కనకరాజు, కల్యాణరావులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని గొలుగొండ పీఎస్‌లో పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వారిని ఉపేక్షించకూడదు: సచ్చిదానంద స్వామి
దైవ ద్రోహానికి పాల్పడితే భగవంతుడు క్షమించడని గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం చేస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment