దోమలగూడ: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక ఐక్య వేదిక ఫౌండర్ చైర్మన్ సి.శంకర్, అధ్యక్షుడు అమానపు అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోమలగూడలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది రజకులు ఉండగా అందులో వృత్తిపై ఆధారపడిన వారు 10 లక్షల మంది వరకు ఉంటారన్నారు.
ప్రభుత్వం రజకుల రక్షణకు చట్టం చేయడంలో, సమగ్రాభివృద్ధికి నిధులు విడుదల చేయడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీరనారి చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, ఆమె విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని వెనుకబడిన తరగతుల సాధికారిత సంస్థ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహిస్తున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.