
కొణిజర్ల: కొణిజర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలోని జంపాలనగర్ తండాలోని గిరిజన దేవత మంగ్తూసాథ్ దేవాలయంలోనికి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహం పై అమర్చిన ఇత్తడి తొడుగుల పైకి చేరింది. అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి పడగ విప్పి ఆడింది. పూజారి సుమారు గంట పాటుపూజలు చేసి హారతి ఇచ్చినా పాము అక్కడి నుంచి కదలలేదు. దీంతో దేవునిపాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుడికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment